LIVE: బీటెక్ రవి అరెస్టుపై టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 15, 2023, 12:08 PM

TDP Leader Bonda Uma Press Meet on Btech Ravi Arrest Live: పది నెలల క్రితం జరిగిన ఓ ఘటనపై పులివెందుల తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. నాటకీయ పరిణామాల మధ్య అర్ధరాత్రి కడప మెజిస్ట్రేట్ ఇంటి ముందు బీటెక్ రవిని హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించి.. కడప కేంద్ర కారాగారానికి తరలించారు. బీటెక్ రవిపై పోరుమామిళ్ల పోలీసులు మరో కేసు కూడా నమోదు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో వరుసగా టీడీపీ నేతల అరెస్టు కలకలం సృష్టిస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నేత ప్రవీణ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసి.. కడప జైలుకు తరలించి 24 గంటలు గడవక ముందే బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. యువగళం ప్రారంభానికి రెండు రోజుల ముందు కడపకు లోకేష్ వచ్చిన సందర్భంగా జరిగిన ఓ సంఘటనలో బీటెక్ రవిని అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 25న నారా లోకేష్ కడప పెద్ద దర్గా దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ క్రమంలో కడప విమానాశ్రయానికి వచ్చిన లోకేష్ కోసం పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. విమానాశ్రయం గేటు వద్ద లోపలి వెళ్లడానికి బీటెక్ రవి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ఆ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యయనే కారణంతో బీటెక్ రవిపైన 10 నెలల తర్వాత వల్లూరు మండలం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం..