LIVE: స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి టీడీపీ నేత బొండా ఉమ మీడియా సమావేశం
Published: Nov 17, 2023, 12:09 PM

TDP Leader Bonda Uma Media Conference: స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి టీడీపీ నేత బొండా ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు. దీనిపై నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిన్న వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపిస్తూ.. ఎన్నికలకు ముందు కావాలనే కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. ఈ కేసులో ముందుగా చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడంతో.. హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి కేసుపై మరిన్ని విషయాల గురించి బొండా ఉమ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.