LIVE: మద్యం ధరల పెంపుపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 18, 2023, 1:03 PM

Tdp Leader Achchennaidu Press Meet Live: సీఎం జగన్.. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఆ తర్వాత దశలవారీగా మద్యంపై నిషేధమంటూ మాట మార్చారు. తీరా చూస్తే.. నాలుగున్నరేళ్లలో లక్షా పదివేల కోట్ల రూపాయలకు పైగా మద్యాన్ని విక్రయించారు. ఇలా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్న జగన్ సర్కార్ వారి నుంచి మరింత ఆదాయం పిండుకోవడానికి కొత్త ఎత్తుగడ వేసింది. ఎంఆర్పీ (Maximum Retail Price) ఆధారంగా వివిధ బ్రాండ్లపై ఫిక్స్డ్ కాంపొనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని మూలధరపై శాతాల రూపంలో వసూలు చేయనుంది. తదనుగుణంగా వ్యాట్, ఏఈడీని సవరించింది.
దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది. అయితే ఈ సవరణలోనే చిన్న మతలబు ఉంది. కొన్ని బ్రాండ్ల మద్యం ధరలు క్వార్టర్ సీసా 10 నుంచి 40 రూపాయల వరకూ, హాఫ్ బాటిల్ 10 నుంచి 50 రూపాయల వరకూ, ఫుల్ బాటిల్ 10 నుంచి 90 రూపాయల వరకూ పెరిగాయి. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గాయి. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరగగా.. అధికంగా అమ్ముడుపోని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గాయి. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగానే లభించనుంది. కావాల్సినవారికి సంబంధించిన కొన్ని బ్రాండ్ల విక్రయాల పరిమాణం పెంచేందుకు వాటి ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరల పెంపుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం..