Live: శృంగవరపుకోటలో దాసరి సామాజిక వర్గీయులతో చంద్రబాబు సమావేశం.. ప్రత్యక్షప్రసారం
Published: May 19, 2023, 12:35 PM

Chandrababu Live: విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో రెండో రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. శిరికి రిసార్ట్స్‌లో చంద్రబాబును గిరిజన వర్సిటీ విద్యార్థులు కలిసి.. తమ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫొటో సెషన్లో చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం దాసరి సామాజిక వర్గం, టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం చంద్రబాబు మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మ.3 గంటలకు సుంకరమెట్ట కూడలికి చేరుకోనున్నారు. సా.4.15 గంటలకు కోర్టు రోడ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం6 గంటలకు నెహ్రూ చౌక్ వద్ద బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ముూడు రోజుల పర్యటన నిమిత్తంలో మొదటి రోజు విశాఖ జిల్లా పెందుర్తిలో పర్యటించిన ఆయన రెండో రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటించారు. ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలవుతాడని తెలిపారు. నిన్న ఎస్.కోటలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు, మృత్య్సకారులతో సమావేశం అయిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చారు.