LIVE: అనకాపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో.. లైవ్
Published: May 19, 2023, 7:53 PM

Chandrababu Naidu Road Show : ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో.. ఈ రోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో పర్యటించారు. చంద్రబాబును చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. శృంగవరపుకోటలో 'ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా దాసరి సామాజిక వర్గం, టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమై మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామానికి శిరికి రిసార్ట్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా శిరికి రిసార్ట్స్‌లో గిరిజన వర్సిటీ విద్యార్థులు చంద్రబాబును కలవనున్నారు. తమ సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించనునన్నారు. అనంతరం ఫొటో సెషన్లో చంద్రబాబు పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అనకాపల్లి జిల్లా పర్యటనకు చంద్రబాబు వచ్చారు. సుంకరమెట్ట కూడలికి చేరుకొని.. కోర్టు రోడ్ నుంచి నెహ్రూ చౌక్ వరకు చంద్రబాబు రోడ్ షోలో పాల్గొన్ననున్నారు. అనంతరం నెహ్రూచౌక్ వద్ద నిర్వహించే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.