LIVE : అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం
Published: May 22, 2023, 5:27 PM

కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీబీఐ పలుమార్లు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే, సీబీఐకి సహకరిస్తానని చెప్తున్న అవినాష్ రెడ్డి.. విచారణకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు తదుపరి చర్యల విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తన అరెస్టుపై అవినాష్ రెడ్డి.. అటు తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు గడప తొక్కారు. అయితే, సీబీఐ అరెస్టుపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వని కోర్టులు.. సీబీఐ విచారణలో తాము కలగజేసుకోమనే సంకేతాలను ఇచ్చాయి. దీంతో మరోసారి అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీం కోర్టు గడప తొక్కారు. ఈ సారి కూడా తాము ఏం చేయలేమని, ప్రొసీజర్ ప్రకారం రావాలని సూచించాయి. మరోవైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరుగురు అధికారులు చిత్తూరు చేరుకుని ఎస్పీ కృష్ణకాంత్‌ను కలిశారు. అరెస్టు చేస్తే.. శాంతి భద్రతల సమస్య వస్తుందని లొంగిపోవాలని చెప్పాల్సిందిగా సీబీఐ అధికారులు సూచించారు. అయితే డీజీపీ సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు.