LIVE: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 18, 2023, 11:03 AM

Rajya Sabha Session Live: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి 5 రోజులపాటు జరగనున్న సమావేశాల్లో ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం వెల్లడించినా అంతకు మించి ఏదో ఉందనే అందరూ భావిస్తున్నారు. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి.. ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనేది అత్యంత ఆసక్తిగా మారింది. సమావేశాలపై ఆగస్టు 3వ తేదీన ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంటు 75 ఏళ్ల ప్రయాణంపై చర్చే ప్రధాన అజెండాగా.. పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్నా.. ఏదైనా ఆశ్చర్యకర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. అజెండాలో లేని కొత్త చట్టాలు, ఇతర అంశాలను పార్లమెంటులో ప్రవేశపెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే పార్లమెంట్లో ఈసారి అనూహ్య అంశాలు జరగవచ్చని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. మరి ఇంతకీ కేంద్రం ఏం చేయనుందో తెలియాలంటే.. ఈ ప్రత్యక్ష ప్రసారం చూడండి.