LIVE: తెలంగాణలోని వరంగల్ తూర్పులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్‌షో
Published: Nov 17, 2023, 1:23 PM

Rahul Gandi at Pinapaka Public Meeting Live : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెలంగాణకు వచ్చారు. భద్రాద్రి కొత్తగుడెం జిల్లా పినపాక, వరంగల్ జిల్లా నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటిస్తారు. పినపాకలో జరిగే బహిరంగ సభ అనంతరం అక్కడ నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 3గంటలకు నర్సంపేట నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. పార్టీ శ్రేణులతో కలిసి నగరంలో పాదయాత్రలో పాల్గొంటారు. అనంతరం సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 నిమిషాలకు వరంగల్ పర్యటన ముగించుకుని మామునూరు నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రాహుల్‌గాంధీకి ఘనస్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కానుంది. దీంతో రాహుల్ గాంధీ పర్యటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 6 గ్యారంటీలతో ప్రచారంలోకి వెళుతున్న కాంగ్రెస్ నాయకులు.. మేనిఫెస్టోతో మరింత ప్రచారంలో జోరు పెంచనున్నారు.