LIVE: పార్లమెంట్ నూతన భవనంలో లోక్సభ సమావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం..
Published: Sep 19, 2023, 9:46 AM

Loksabha Sessions Live : గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సోమవారం నుంచి 5 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో.. ప్రభుత్వం ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందా? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఎజెండా ఇదీ అంటూ కొన్ని వివరాలను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల లక్ష్యమేంటి? ఎందుకు కేంద్ర ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది? అనే విషయం అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఆగస్టు 3న ఈ సమావేశాలపై ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలపై ఎన్నో ఊహాగానాలు నెలకొన్నాయి. తొలుత ఎజెండా గురించి ప్రకటనలేమీ లేకపోవడం వల్ల సోనియా గాంధే స్వయంగా ప్రధానికి లేఖ రాశారు. దీంతో గత బుధవారం తాత్కాలిక ఎజెండాను ప్రకటించింది కేంద్రం. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. వీటిని ప్రధాన ప్రతిపక్షం ఏ మాత్రం నమ్మడం లేదు. చివరి నిమిషంలో ఏవో బాంబులను పేల్చే అవకాశముందని అనుమానం వ్యక్తం చేస్తోంది. తాజాగా లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.