Live శ్రీశైలం నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర..
Published: May 13, 2023, 4:43 PM

Yuvagalam Padayatra: తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర నేటికి 98వ రోజుకు చేరింది. నేడు నుంచి కేస్టార్ గొడౌన్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా నేడు ఆత్మకూరులో నిర్వహించే బహిరంగ సభలో లకేశ్ మాట్లాడుతారు. సాయంత్రం కరివేనలో స్థానికులతో భేటీ కానున్న లోకేశ్.. ఆత్మకూరు కోర్టు రోడ్డులో న్యాయవాదులతో సమావేశం కానున్నారు. నేడు రాత్రి ఆత్మకూరులో డ్వాక్రా మహిళలతో లోకేశ్ మాటామంతి కార్యక్రంలో పాల్గొంటారు. నంద్యాల మలుపు వద్ద ముస్లింలతో నారా లోకేశ్ సమావేశమవుతారు. అనంతరం చెంచుకాలనీలోని స్థానికులతో లోకేశ్ చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. లోకేశ్ పాదయాత్రలో ప్రజలు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. సామన్యులకు ఇబ్బుందులు కలగకుండా... నాయకులు, కార్యకర్తలకు మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం పంపిణీ చేస్తున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో ప్రజలతో ఫోటోలు, వివిధ సామాజిక వర్గాలతో జరిగే సమావేశాల నిర్వహిస్తూ.. లోకేష్ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.