LIVE: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ పాదయాత్ర.. ప్రత్యక్ష ప్రసారం
Published: May 21, 2023, 4:40 PM

బనగానపల్లిలో యువ గళానికి జనం బ్రహ్మరథం పట్టారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రసంగిస్తున్న సమయంలో నినాదాలు మార్మోగాయి. పాదయాత్రలో జనం అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. వారి సమస్యలు తెలుసుకుంటూ వినతి పత్రాలు తీసుకుని భరోసా నింపారు. జగన్ పాదయాత్రలో భాగంగా బనగానపల్లికు వచ్చినప్పుడు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మైనింగ్ యజమానులతో సమావేశమయ్యారు. మైనింగ్ లీజ్‌కు సంబంధించి సమస్యలు లోకేశ్‌కు విన్నవించుకున్నారు. లక్షల్లో ఖర్చులు పెట్టి మైనింగ్ చేస్తే.. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతున్నట్లు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేశ్, పాత మైనింగ్ విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. మైనింగ్‌లో ప్రభుత్వం తీసుకున్న విధానాల వల్ల రాష్ట్రంలో తాము బతికే పరిస్థితి లేదని మైనింగ్ యజమానులు తెలిపారు. వైసీపీ అధికారంలోకి రావడానికి తియ్యని మాటలు చెప్పిందని, అందుకనే భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసిన లోకేశ్.. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులపై వైసీపీ విధానాలే కారణమని వెల్లడించారు.