Live: నంద్యాల నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర.. లైవ్
Published: May 19, 2023, 2:36 PM

Nara Lokesh Yuvagalam Padayatra Live: ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 104వ రోజు నంద్యాల నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. సాయంత్రానికి లోకేశ్ యువగళం పాదయాత్ర బనగానపల్లి నియోజకవర్గంలోకి అడుగు పెట్టనుంది. బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామ సమీపంలోని పెద్దమ్మ గుడి వద్దకు సాయత్రం 3:10 గంటలకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు అప్పలాపురంలో వడ్డెర సామాజిక వర్గీయులతో లోకేశ్ సమావేశం కానున్నారు. అనంతరం 7గంటలకు కైపలో యాదవులతో మాట్లాడుతారు. ఆ తర్వాత కైపలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేశ్ బస చేస్తారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని లోకేశ్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. తాజాగా నిన్న 1300 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకుని మరో మైలురాయిని పూర్తి చేసుకుంది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈటీవీ భారత్‌లో ప్రత్యక్షప్రసారం..