LIVE: చంద్రబాబు రిమాండ్ పై ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియా సమావేశం.. ప్రత్యక్షప్రసారం
Published: Sep 12, 2023, 1:19 PM

Raghuramakrishna Raju Media Conference Live: చంద్రబాబు అరెస్టు రిమాండ్ నేపధ్యంలో రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద పోలీసుల భారీగా మోహరించారు. కేంద్ర కారాగారం వైపు ఎవరినీ రానీయకుండా ఆంక్షలు విధించారు. రాజమండ్రి కేంద్ర కారాగారం పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అందుబాటులో ఉన్న టీడీపీ నాయకులతో లోకేశ్ చర్చలు జరుపుతున్నారు. ఈ రోజు చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ క్రమంలో చంద్రబాబు హౌస్ అరెస్టు పిటిషన్‌పై ఇవాళ కోర్టు నిర్ణయం తీసుకోనుంది. జైలులో భద్రతపై అనుమానాలున్నాయని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపంచారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పు కాపీలను ఏసీబీ కోర్టుకు ఇచ్చిన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఆయన ఖండించారు.. ఈ సందర్భంగా రఘురామ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.