LIVE: అవినాష్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
Published: May 26, 2023, 7:11 PM

అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉండి: సీబీఐ
అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు: సీబీఐ
హత్య వెనక భారీ కుట్ర చెప్పేందుకు అవినాష్ ముందుకు రావడం లేదు: : సీబీఐ
హత్య జరిగిన రాత్రి 12.27 నుంచి 1:10 వరకు అవినాష్ వాట్సప్ కాల్స్ మాట్లాడారు: సీబీఐ
ఈనెల 15న నోటీస్ ఇస్తే నాలుగు రోజులు సమయం కావాలన్నారు: సీబీఐ
ఈనెల 16న నోటీసిస్తే తల్లి అనారోగ్యం వల్ల రాలేనన్నారు: సీబీఐ
ఈనెల 19న తల్లి అనారోగ్యం నేపంతో ఉద్దేశపూర్వకంగా హైదరాబాదు విడిచి వెళ్లారు: సీబీఐ
విచారణకు రావాలని అవినాష్ కు ఫోన్ చేసి కోరినప్పటికీ రాలేదు: సీబీఐ
ఈనెల 22న రావాలని నోటీస్ ఇస్తే తల్లి అనారోగ్యం వల్ల వారం రోజులు రానన్నారు: సీబీఐ
అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ఈనెల 22న సీబీఐ బృందం కర్నూలు వెళ్ళింది: సీబీఐ
ఆస్పత్రి వద్ద అవినాష్ అనుచరులు భారీగా ఉండడంతో శాంతిభద్రల సమస్య రావచ్చునని అనిపించింది: సీబీఐ
జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉన్నందున అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు : సీబీఐ