LIVE: నరసాపురం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర.. ప్రత్యక్షప్రసారం
Published: Sep 7, 2023, 10:00 AM

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉత్సాగంగా సాగుతుంది. ఈ పాదయాత్ర నేడు ఉదయం 8 గంటలకు సీతారాంపురం క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభం. 9.15 నరసాపురం జగన్నాథ ఆలయం వద్ద చేనేతలతో సమావేశం. 10 గంటలకు పంజా కూడలిలో ముస్లింలతో సమావేశం. 10.30కు థాయ్ సుబ్బారావు ఆసుపత్రి వద్ద స్థానికులతో భేటీ. 10:40 గాంధీ విగ్రహం వద్ద మహిళలతో సమావేశం. 10.50 జ్యుయలరీ కూడలిలో రజక సామాజిక వర్గీయులతో భేటీ. 11 గంటలకు బస్టాండు వద్ద స్థానికులతో మాటామంతీ. 11.10 శ్రీహరిపేటలో బీసీ సామాజిక వర్గీయులతో సమావేశం. 11.20 రైల్వే రోడ్డులో స్థానికులతో సమావేశం. 11.40 నరసాపురం లాక్పేటలో స్థానికులతో సమావేశం. మధ్యాహ్నం 12:25కు సరిపల్లిలో భవన నిర్మాణ కార్మికులతో భేటీ. 12.40కు సరిపల్లి శివార్లలో భోజన విరామం. 3 గంటలకు సరిపల్లి శివార్లలో అగ్నికుల క్షత్రియులతో ముఖాముఖి. సాయంత్రం 4 గంటలకు సరిపల్లి శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు. 4:30కు చినమామిడిపల్లి వద్ద పాదయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలోకి ప్రవేశం. 6 గంటలకు దిగమర్రు వద్ద మహిళలతో సమావేశం. 6.20 పెద మామిడిపల్లి వద్ద కల్లుగీత కార్మికులతో సమావేశం. 7.20 తూర్పు కాజ వద్ద ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో భేటీ. రాత్రి 8 గంటలకు కలగంపూడిలో శాలివాహన సామాజిక వర్గీయులతో సమావేశం. 8.20 కలగంపూడి శివారు విడిది కేంద్రంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర ప్రత్యక్షప్రసారం.