LIVE: రాజమహేంద్రవరంలో లోకేశ్ మీడియా సమావేశం.. ప్రత్యక్షప్రసారం
Published: Sep 14, 2023, 3:14 PM

Lokesh Media Conference Live: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబుతో నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ అయ్యారు. ఇప్పటికే లోకేశ్ తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణితో కలిసి చంద్రబాబును కలుసుకున్నారు. పవన్ కూడా జైలులో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. బాలకృష్ణ చంద్రబాబును కలిసేందుకు తొలిసారి జైలులోకి వెళ్లారు. అరెస్ట్ అయ్యాక బాలకృష్ణ, లోకేశ్, పవన్ ముగ్గురూ కలిసి ఒకేసారి చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణ సహా పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది. చంద్రబాబును కలిసేందుకు తొలుత... బాలకృష్ణ, లోకేశ్... కలిసి రాజమహేంద్రవరం కారాగారం వద్దకు చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు రాజమహేంద్రవరం చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వాహన శ్రేణితో జైలు వద్దకు చేరుకున్నారు. పవన్ కారాగారం వద్దకు చేరుకున్నాక బాలకృష్ణ, లోకేశ్‌తో కలిసి జైలులోకి వెళ్లారు. చంద్రబాబుతో వీరి ములాఖత్ నేపథ్యంలో పోలీసులు జైలు వద్ద భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో లోకేశ్ మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.