LIVE: నాంపల్లి బజార్ ఘాట్ రోడ్డులో అగ్నిప్రమాదం- ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 13, 2023, 11:14 AM

Fire Accident in Nampally Live : ఆదివారం రోజున హైదరాబాద్ మహానగరంలో ఒకే రోజు ఐదు వేర్వేరు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. మల్కాజిగిరిలో జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్య తీవ్ర గాయాలపాలైంది. వరుస ప్రమాదాలతో అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఎగిసిపడిన అగ్నికీలల కారణంగా భారీగానే ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనలు మరువకముందే తాజాగా హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి బజార్ ఘాట్‌లోని.. నాలుగు అంతస్తుల ఓ రసాయన గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. లోపల ఇంకా 10 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గిడ్డంగి వద్ద ఉన్న కారు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. 4 అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా మంటలు చూసి భయాందోళన గురయ్యామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.