Live: ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్న భారత్
Published: Nov 19, 2023, 11:08 AM

వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ టైటిల్‌ను ముద్దాడాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వ విజేతగా నిలవాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఎలాంటి ప్రదర్శన కనబర్చాయో తెలుసుకుందాం.
Ind vs Aus Final 2023 : అహ్మదాబాద్.. నరేంద్ర మోదీ స్టేడియం వేదిక ఆదివారం టీమ్ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు విశ్వ విజేత ఎవరా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా చేసిన పెర్ఫార్మెన్స్లపై ఓ లుక్కేద్దాం.
కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నమెంట్‌ల్లో టీమ్ఇండియాకు నిరాశ ఎదురవుతోంది. ఇలాంటి టోర్నీల్లో లీగ్ దశలో భారత్ బాగానే ఆడుతున్నా.. నాకౌట్/ ఫైనల్స్‌కు వచ్చేసరికి విఫలమవుతున్నాయి. అయితే ఈ సారి మాత్రం టీమ్ఇండియా లీగ్ స్టేజ్‌లో, సెమీ ఫైనల్స్‌లో అప్రతిహతంగా దూసుకెళ్లింది. వరుసగా 10 మ్యాచ్‌లో విజయం సాధించింది. అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది.