LIVE : హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ - ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 17, 2023, 6:08 PM

Congress Vijayabheri Sabha in Tukkuguda Live : రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ హైదరాబాద్ తుక్కుగూడలో ఇవాళ విజయభేరి సభ నిర్వహిస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం భాగ్యనగరానికి వచ్చిన పార్టీ అగ్రనేతలు బహిరంగ సభలో పాల్గొన్నారు. తుక్కుగూడ సభ వేదికగా... రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు హామీల గ్యారంటీ కార్డును కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్మన్ సోనియా గాంధీ విడుదల చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసేలా ఆరు హామీల పథకాలను రూపొందించారు. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, నిరుద్యోగుల లక్ష్యంగా గ్యారంటీలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలతోపాటు... సీడబ్ల్యూసీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు అంతా సభకు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలు పాల్గొంటుండం, ఎన్నికల గ్యారెంటీల ప్రకటించే సభ కావడంతో... పీసీసీ కనీవిని ఎరుగనిరీతిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి... కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు విజయభేరి సభకు తరలివచ్చారు.