Live: అమరావతిలో R 5 జోన్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం.. ప్రత్యక్షప్రసారం
Published: May 26, 2023, 11:24 AM

CM Jagan Distributes the House Plots Live: రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సర్వం సిద్ధమైంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా.. గుంటూరు, NTR జిల్లాల పరిధిలోని పేదలకు.. అమరావతి ప్రాంతంలో పట్టాలను అందజేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10గంటలకు వెంకటపాలెం చేరుకున్నారు. స్టాళ్ల సందర్శన, లబ్దిదారులతో ఫొటో సెషన్ తర్వాత సభా వేదికపైకి వచ్చారు. ప్రసంగం అనంతరం పట్టాలు పంపిణీ చేశారు. తుళ్లూరు మండలంలోని వెంకటపాలెంలో జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 2 జిల్లాల యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. లక్ష మందిని సభకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణానికి సరైన రహదారులు లేకపోవటం..అందులోనూ వేసవి కావడంతో జన సమీకరణ కోసం అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రహదారులకు హడావుడిగా మరమ్మతులు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులందరినీ ఆహ్వానించారు. వారి కుటుంబసభ్యులు, బంధువులు కూడా రావాలని చెప్పారు. ప్రజల్ని తరలించేందుకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా నుంచి పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను కేటాయించారు. విద్యాసంస్థల నుంచి మరో 12వందల బస్సులు సమీకరించారు. ఉదయం 7 గంటల కల్లా బస్సులు బయలుదేరాలని ఆదేశించారు. 3వేల మంది పోలీసులను బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయించారు.