LIVE: చంద్రబాబును రాజమహేంద్రవరం జైలులో కలిసిన కుటుంబసభ్యులు
Published: Sep 12, 2023, 4:20 PM

CBN Family Reach Rajamahendravaram Central Jail Live: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తొలి రోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు.. కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. ఆ రూములో వెస్ట్రన్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు సహాయకుడిగా ఒక వ్యక్తిని కూడా అందుబాటులో ఉంచారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా బాబు జిల్లాలు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచి, అందులో ప్రత్యేకంగా తయారు చేసిన అల్పాహారాన్ని, భోజనాన్ని చంద్రబాబుకు అందిస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద ఉంటూ చంద్రబాబుకు అవసరమైనవి సమకూరుస్తున్నారు. కాగా జైలులో ఉన్న చంద్రబాబును చూసేందుకు ఆయన ఫ్యామిలీ రాజమహేంద్రవరం చేరుకున్నారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, రామకృష్ణ, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, భరత్.. సాయంత్రం చంద్రబాబును కలవనున్నారు.