Live:చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తున్న సీఐడీ పోలీసులు.. ప్రత్యక్ష ప్రసారం
Published: Sep 10, 2023, 6:19 AM

స్కిల్ డెవల్ ప్మెంట్ కేసుపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలువినిపిస్తున్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడం సరికాదని లూథ్రా వాదించారు. సెక్షన్ 409 పెట్టాలంటే ముందు సరైన సాక్ష్యం చూపాలన్నారు. రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలంటూ నోటీసు ఇచ్చారు. లూథ్రా ఇచ్చిన నోటీసు మేరకు తిరస్కరణ వాదనలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈమేరకు వాదనలు వినిపించిన లూథ్రా.... సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు. ఇక ఈ కేసులో సీఐడీ తరఫున అడి।।షనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసి... 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. స్కిల్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసినట్లు ఏఏజీ తెలిపారు. 2015లోనే స్కామ్ మొదలైందన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి... జీవో నెంబర్ 4 జారీలో కుట్ర దాగి ఉందన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర అత్యంత కీలకమని వాదించారు. చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించడానికి అనుమతించాలని సుధాకర్ రెడ్డి కోరారు. సీఐడీ తరఫున వాదనలు పూర్తయ్యాక న్యాయమూర్తి 15 నిమిషాలు విరామం ప్రకటించారు. విరామం తర్వాత సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.