LIVE: రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు.. ప్రత్యక్ష ప్రసారం..
Published: Sep 6, 2023, 11:46 AM

Babu Tour Live: నిన్నటి నుంచి వరుసగా 5రోజుల పాటు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. పర్యటనల్లో భాగంగా వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు, సమావేశాలు, రోడ్ షోలు, సభల్లో చంద్రబాబు పాల్గొనున్నట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. నిన్న బళ్లారి మీదుగా రాయదుర్గం వెళ్లారు. బళ్లారిలో స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. నిన్న సాయంత్రం రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. అనంతరం పల్లెపల్లి గ్రామంలో వేరుశనగ రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాయదుర్గం పట్టణంలో టీడీపీ శ్రేణులు నిర్వహించే చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజల ఆర్థిక పరిపుష్టి, రక్షణ, భవిష్యత్తు కోసం అంటూ తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోగా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాల ఉద్దేశ్యాలు, వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. నేడు నేడు అనంతపురం, రేపు గుంతకల్లులో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాగా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం మీకోసం..