LIVE తాడేపల్లి కుంచనపల్లి సిట్ కార్యాలయంలో చంద్రబాబు.. ప్రత్యక్షప్రసారం
Published: Sep 9, 2023, 6:13 AM

నంద్యాలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు పోలీస్ బలగాలు భారీగా వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి నంద్యాల బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు RK ఫంక్షన్ హాల్ వద్ద బస చేశారు. తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో అనంతపురం DIG రఘురామిరెడ్డి నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబును కలవాలంటూ NSG సిబ్బందిని రఘురామిరెడ్డి కోరారు. పక్కనే ఉన్న తెలుగుదేశం నాయకులు ఈ సమయంలో కలవాల్సిన పనేంటని.... ప్రశ్నించారు. మీకెందుకు చెప్పాలంటూ రఘురామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. కేసుతో......మీకేం సంబంధం అంటూ వాదించారు. అసలు కేసేంటో చెప్పాలంటూ తెదేపా నేతలు రఘురామిరెడ్డిని నిలదీశారు. ఐతే.. కేసు వివరాలపై నోరు మెదపని రఘురామిరెడ్డి...చంద్రబాబు బస చేసిన బస్సు తలుపుల వద్దకు దూసుకెళ్లారు. వారి తీరుపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. విషయమేంటో చెప్పకుండా..... ఎందుకు హడావుడి చేస్తున్నారని నిలదీశారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా రఘురామిరెడ్డి ఎదురుదాడి చేయడం తప్ప..సమాధానం ఇవ్వలేదు. ఈ సందర్భంగా ప్రత్యక్షప్రసారం.