LIVE: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియా సమావేశం.. ప్రత్యక్ష ప్రసారం..
Published: Sep 18, 2023, 11:14 AM

BJP State President Purandeswari Press Meet Live: స్కిల్ డవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా సానుకూలంగా స్పందించి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పవన్ కల్యాణ్ అనటంలో తప్పులేదని, పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని తెలిపారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని పురందేశ్వరి స్పష్టం చేశారు. కాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం..