LIVE: ఒంగోలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు- ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 20, 2023, 11:32 AM

BJP State Executive Meeting in Ongole Live: ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో ఈ రోజు ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి అధ్యక్షతన జరుగు సమావేశంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు జిల్లాస్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్నవారిలో బీజేపీ ముఖ్య నేతలు, బీజేపీ జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు ఎంపీ జీవీఎల్ నరసింహ రావు , సీఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ కేంద్రమంత్రి సుజనాచౌదరి, మాజీ ఎమ్మెల్సీలు.. వాకాటి నారాయణ రెడ్డి, పీవీఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం..