LIVE: తెలంగాణ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూ
Published: Nov 14, 2023, 7:27 PM

BJP MP Laxman Exclusive Interview LIVE : రాష్ట్రంలో బీజేపీ సోమవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తుంది. అలాగే సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఎస్సీ వర్గీకరణ సభలో ప్రధాని మోదీ.. చేసిన ప్రసంగం విజయవంతం కావడంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలను నమ్మవద్దంటూ బీజేపీ నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ 15 రోజులు రాష్ట్రంలో జాతీయ నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రాష్ట్ర నాయకత్వం ఈ 15 రోజులు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లనునుంది. అలాగే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటనలు, ముఖ్య నాయకుల పర్యటనలు ఉండనున్నాయి.
Exclusive Interview With BJP MP Laxman : కుటుంబాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు హితం కోరే పార్టీలు కావని రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకునే పార్టీలని విమర్శించారు. కేసీఆర్‌కు రెండుసార్లు అవకాశమిస్తే బంగారు తెలంగాణను.. బిక్షమెత్తుకునేలా చేశారని మండిపడ్డారు. మరోసారి అవకాశమిస్తే చిప్పకూడా మిగలదు లక్ష్మణ్ హెచ్చరించారు. మరోవైపు బీజేపీ జనసేన పార్టీల పొత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తుందా? రాష్ట్రంలో అనుకున్నట్లుగా బీజేపీ అధికారంలోకి వస్తే అధిష్ఠానం చేప్పినట్లుగా బీసీ ముఖ్యమంత్రి చేస్తారా..? పొత్తును బీజేపీ వినియోగించుకుంటుదా అనే మరిన్ని విషాయాలపై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.