Live: చంద్రబాబుతో పవన్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్....
Published: Sep 14, 2023, 10:08 AM

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణ నేడు రాజమహేంద్రవరంలో భేటీకానున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈభేటీకి ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, లోకేశ్ కలిసి వెళ్లనున్నారు. ముందుగా బాలయ్య, పవన్‌కల్యాణ్ రాజమహేంద్రవరంలో ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్‌ను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి పవన్, బాలయ్య, లోకేశ్ కలిసి కేంద్రకారాగారానికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో విజయవాడ వస్తున్న జనసేనానిని పోలీసులు దారిపొడవునా అడ్డుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆయన రాజమహేంద్రవరం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రాజమహేంద్రవరం చేరుకున్న బాలకృష్ణ అక్కడ సోదరి భువనేశ్వరితో సమావేశం అయ్యారు. సోదరిని పరామర్శించారు. అనంతరం లోకేశ్‌ని కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. పవన్‌కల్యాన్ రాజమహేంద్రవరం చేరుకున్న తర్వాత ముగ్గురు చంద్రబాబును కలవనున్నారు.