LIVE: చంద్రబాబుకు బెయిల్ మంజూరు - ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మీడియా సమావేశం
Published: Nov 20, 2023, 2:26 PM

Bail Granted to Chandrababu in Skill Development Case Live: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ మంజూరైంది. మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. బెయిల్ పిటిషన్‌పై ఇటీవలే వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయావాది సిద్దార్థ లూథ్రా (Sidharth Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై చంద్రబాబు ఉండగా.. పూర్తి స్థాయి బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 15వ తేదీన వాదనలు జరిగాయి. కానీ ఆరోజు పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది. వాదనలు ఆరోజు పూర్తి కావడంతో వాయిదా వేసిన న్యాయస్థానం.. బెయిల్ మంజూరు చేసింది.