లైవ్: విజయవాడలో బీసీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యక్ష ప్రసారం
Published: Nov 17, 2023, 12:07 PM

All Parties BC Leaders Round Table Meeting in Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో బీసీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర, అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఇంచార్జ్ బుద్దా వెంకన్న, అఖిలపక్ష పార్టీల నాయకులు, కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై చర్చలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధిని పట్టించుకోవండం లేదని, బీసీలను చిన్న చూపు చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధిని టీడీపీ అన్ని వేళలా కృషి చేసిందని.. భవిష్యత్తులో కూడా కృషి చేస్తుందని కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
విజయవాడలో బీసీ అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ప్రత్యక్ష ప్రసారం.. మీ కోసం..