LIVE: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నారా లోకేశ్ పాదయాత్ర
Published: May 22, 2023, 5:01 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 107వ రోజు నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. బనగానపల్లె నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్రను ముగించుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. భూమా జగద్విఖ్యాత్ రెడ్డి, ఇతర నేతలు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో భాగంగా బనగానపల్లికి వచ్చినప్పుడు ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ.. వైసీపీ వైఫల్యాలు ఎండగట్టారు. ఎస్ఆర్బీసీ పంట కాలువల్లేక సాగునీరు అందడం లేదు.. రూ.35 కోట్లు వెచ్చిస్తే సాగునీరు ఇవ్వొచ్చని అధికారులు ప్రతిపాదన పంపినా జగన్ ఒక్క రూపాయి ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయిన తర్వాత రూ.312 కోట్లతో జొలదరాశి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. నాలుగేళ్లయినా ఒక్క ఇటుక వేయలేదు.. రూ.23 కోట్లతో దద్దనాల ఎత్తిపోతలను ఏర్పాటు చేస్తే జగన్ ప్రభుత్వం విద్యుత్తు బిల్లు చెల్లించకపోవడంతో మూతపడిందన్నారు. అవుకు జలాశయం నుంచి కోవెలకుంట్లకు మంచినీరు ఇచ్చేందుకు రూ.18 కోట్లతో పనులు ప్రారంభిస్తే మధ్యలోనే ఆపేశారన్నారు. అవుకు టన్నెల్ నిర్మాణం పూర్తి చేయకుండా ఆపేశారన్నారు. టీడీపీ హయాంలో బి.సి.జనార్దన్‌రెడ్డి 13 కి.మీ.ల రింగురోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత ప్రభుత్వం పనులు నిలిపివేసిందన్నారు.