మరో విమానం క్రాష్​.. నలుగురు మృతి.. ల్యాండ్​ అవుతుండగా ప్రమాదం

author img

By

Published : Jan 18, 2023, 7:31 AM IST

Updated : Jan 18, 2023, 9:11 AM IST

texas plane crash

అమెరికాలోని టెక్సాస్​లో ఓ చిన్న విమానం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. వీరంతా చర్చికి సంబంధించిన వారిగా గుర్తించారు.

నేపాల్​లో విమానం కూలి 70 మంది మరణించన ఘటన మరవకముందే మరో ప్రమాదం జరిగింది. అమెరికాలోని టెక్సాస్​లో ఓ చిన్న సైజు విమానం కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ప్రమాదం సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నారని.. నలుగురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆస్పత్రికి తరలించారు. టెక్సాస్​ విమానాశ్రానికి చేరుకుంటున్న క్రమంలో విమానం క్రాష్​ అయినట్లు అధికారులు వెల్లడించారు.

బుధవారం ఉదయం విక్టోరియా యోకుమ్​కు కేవలం ఒకమైలు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా జర్మన్‌టౌన్‌లోని మెంఫిస్ శివారులో ఉన్న ఓ చర్చికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ విమాన ప్రమాదం నుంచి చర్చి ప్రధాన పాస్టర్ కెన్నన్ వాఘన్​ గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు సంబంధిత అధికార సిబ్బంది తెలిపారు. మృతులు బిల్​ గార్నర్​, స్టీవ్ టక్కర్​, టైలర్​ ప్యాటర్సన్, టైలర్ స్ప్రింగర్​లుగా ఆ చర్చి అధికారిక వెబ్​సైట్​లో వెల్లడించింది.​

Last Updated :Jan 18, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.