పాపం పాక్ ప్రధాని.. హెడ్​ఫోన్స్​తో తంటా.. మీమర్స్​కు పంట

author img

By

Published : Sep 16, 2022, 12:00 PM IST

shehbaz sharif meets putin

Shehbaz Sharif headphones : అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్​ ప్రధానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో భేటీ సందర్భంగా హెడ్​ఫోన్స్ పెట్టుకునేందుకు షెహ్​బాజ్ షరీఫ్ నానా తంటాలు పడ్డారు. దీనిపై సోషల్​ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తాయి.

Shehbaz Sharif headphones : రష్యా అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీలో పాకిస్థాన్ ప్రధాని షెహ్​బాజ్ షరీఫ్​ హెడ్​ఫోన్స్​తో ఇబ్బంది పడడం సోషల్​ మీడియాలో సెటైర్ల వరదకు కారణమైంది. "పాకిస్థాన్​ పరువు తీస్తున్నారు" అంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు, కొందరు సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.

షాంఘై సహకార సంస్థ సదస్సు కోసం ఉజ్బెకిస్థాన్​లోని సమర్​ఖండ్​ వెళ్లారు షరీఫ్. అదే సదస్సుకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ సమయంలో పుతిన్​ చెప్పే మాటల అనువాదం వినేందుకు హెడ్​ఫోన్స్ పెట్టుకున్నారు షరీఫ్. అయితే అవి జారి కింద పడిపోయాయి. పక్కనున్న వ్యక్తి సాయం తీసుకున్నా మళ్లీ అలానే జరిగింది. పాక్ ప్రధాని ఇబ్బందులు చూసి ముసిముసి నవ్వులు నవ్వారు పుతిన్. ఈ వీడియోను రష్యా అధికార మీడియా సంస్థ ఆర్​ఐఏ షేర్ చేయగా.. పాక్​లోని ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యూజర్లు షరీఫ్​పై విమర్శలతో విరుచుకుపడ్డారు.

shehbaz sharif meets putin
పుతిన్​ను కలిసిన షరీఫ్​
shehbaz sharif meets putin
పుతిన్​ను కలిసిన షరీఫ్​

వేర్వేరు దేశాల ప్రతినిధులతో షరీఫ్​​ భేటీలకు సంబంధించిన ఫొటోలను అస్త్రంగా చేసుకుని అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు పాకిస్థాన్​లోని ప్రతిపక్ష పీటీఐ పార్టీ నేత ఖాసిం ఖాన్ సూరి. ఓ ఫొటోలో విదేశీ ప్రతినిధులంతా ఏదో రాసుకుంటుంటే.. పాక్ బృందంలోని వారంతా ఖాళీగా కూర్చోవడాన్ని తప్పుబట్టారు. వారిని యాచకులుగా అభివర్ణించారు.

shehbaz sharif
విదేశీ ప్రతినిధులతో పాక్ ప్రధాని భేటీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.