న్యూయార్క్​లో భారత మహిళ ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేక వీడియో తీసి మరీ..

author img

By

Published : Aug 6, 2022, 8:02 PM IST

Massive outrage after Indian-origin woman, tortured for not bearing son, ends life

New York suicide: అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ ప్రవాస భారతీయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికా న్యూయార్క్​లో జరిగింది. అంతకుముందు తన బాధలను పంచుకుంటూ సోషల్​ మీడియాలో ఓ పోస్ట్​ చేసింది మృతురాలు.

New York suicide: కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. 'ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా' అంటూ అందులో వాపోయింది. తన బాధలను పంచుకుంటూ.. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్‌ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది.

మన్‌దీప్‌ కౌర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన మన్‌దీప్‌ కౌర్​కు (30) రన్‌జోద్‌బీర్‌ సింగ్‌ సంధుకు 2015లో వివాహం జరిగింది. అనంతరం వీరు అమెరికాలోని న్యూయార్క్‌కు వలస వెళ్లారు. వారికి 4, 2 ఏళ్ల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే కుమార్తెలు సంతానంగా కలగడంతో కౌర్‌కు వేధింపులు మొదలయ్యాయి. భర్త శారీరకంగా హింసించేవాడు. అత్తింటివారు సైతం మానసికంగా హింసించేవారు. 'ఆత్మహత్య చేసుకొని చనిపొమ్మంటూ అత్తింటివారు వేధిస్తున్నారు.' అని కౌర్‌ ఆ వీడియోలో వాపోవడం ఆమె దీనస్థితికి అద్దం పడుతోంది. భర్త దాడులకు సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Massive outrage after Indian-origin woman, tortured for not bearing son, ends life
మన్‌దీప్‌ కౌర్

కాగా, వీటిని భరించలేని మన్‌దీప్‌ కౌర్‌ వీడియోలో తన బాధను పంచుకుంది. ఎనిమిదేళ్లుగా ఈ బాధలను అనుభవిస్తున్నానని, ఇకనైనా భర్త మారతాడేమోనని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది. ఇన్ని బాధలను అనుభవిస్తూ ఇకపై బతికుండలేనని పేర్కొంటూ.. ఆపై ఆత్మహత్యకు పాల్పడింది. యూపీలోని మృతురాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని వెల్లడించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా ఆమె మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, భర్త, అతడి కుటుంబం సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనే అంశంపై సమాచారం లేదు.

Massive outrage after Indian-origin woman, tortured for not bearing son, ends life
భర్తతో మన్​దీప్​ కౌర్​

ఇవీ చూడండి: UK PM race: సునాక్​కు కొత్త ఉత్సాహం.. టీవీ చర్చలో 'ఆమె'పై గెలుపు

తైవాన్ కీలక రక్షణ అధికారి మృతి... దండయాత్ర కోసం చైనా ప్రాక్టీస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.