గోవా విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్థాన్​కు​ దారి మళ్లింపు

author img

By

Published : Jan 21, 2023, 11:33 AM IST

Updated : Jan 21, 2023, 12:08 PM IST

Moscow Goa flight diverted to Uzbekistan

రష్యా నుంచి గోవా బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపుతో అజుర్​ ఎయిర్​కు చెందిన ఫ్లైట్​ను ఉజ్బెకిస్థాన్​ డైవర్ట్​ చేశారు.

రష్యా నుంచి గోవాకు బయలుదేరిన విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపులతో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించారు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. రష్యా నుంచి గోవాకు బయలుదేరిన అజుర్​ ఎయిర్​ ఏజెడ్​వీ 2463 విమానం దక్షిణ గోవాలోని దబోలిమ్​ విమానాశ్రయంలో శనివారం ఉదయం 4.15 గంటలకు ల్యాండ్​ కావాల్సి ఉందని తెలిపారు. ఈ తరుణంలో భారత గగన తలంలోకి ప్రవేశించే లోపే ఉజ్బెకిస్థాన్​కు మళ్లించారు.

రాత్రి 12.30 విమానంలో బాంబు ఉందని దబోలిమ్​ ఎయిర్​పోర్టు డైరెక్టర్​కు ఈమెయిల్​ వచ్చిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే దబోలిమ్​ వినాశ్రయం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా గోవా పోలీసులు, క్విక్​ రెస్పాన్స్​ టీమ్​, యాంటీ టెర్రరిజం స్క్వాడ్​, డాగ్​ స్క్వాడ్​లను​ విమానాశ్రయం వద్ద మోహరించారు. ఈ మేరకు వాస్కో డీఎస్​పీ సలీం షేక్​ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

కాగా, ఇదే తరహాలో జనవరి 9న అజుర్​ ఎయిర్​కు చెందిన మాస్కో-గోవా విమానం గుజరాత్​లోని జామ్​నగర్​ ఎయిర్​పోర్టులో అత్యవసర ల్యాండ్​ అయింది. అప్పడు అజుర్​ ఎయిర్​ కార్యాలయానికి బాంబు ఈ మెయిల్​ వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated :Jan 21, 2023, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.