Sweden PM resign: ఇలా ప్రధాని పగ్గాలు.. అలా రాజీనామా!

author img

By

Published : Nov 25, 2021, 8:56 AM IST

Sweden first female PM Magdalena Andersson

స్వీడన్​కు తొలి మహిళా ప్రధానిగా(Sweden first female PM) పగ్గాలు చేపట్టిన.. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు మగ్దలీనా అండర్సన్​. పార్లమెంటులో ఓ బడ్జెట్‌ ఓడిపోవడం, సంకీర్ణ ప్రభుత్వం నుంచి భాగస్వామి వైదొలగడం వల్ల ఆమె రాజీనామా చేశారు.

ఐరోపా దేశమైన స్వీడన్‌లో బుధవారం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళకు ప్రధాని పగ్గాలు అప్పగించడం.. కొద్ది గంటల్లోనే ఆమె రాజీనామా(Sweden PM resign) చేయడం వంటి పరిణామాలు చకచకా చోటుచేసుకున్నాయి.

మగ్దలీనా అండర్సన్​కు(54) దేశ పాలన పగ్గాలను అప్పగిస్తూ పార్లమెంటు ఆమోదం తెలిపింది. దేశఆర్థిక మంత్రి, సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన అండర్సన్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారంటూ అంతర్జాతీయంగా ప్రశంసలు కూడా అందుకున్నారు. కొద్ది గంటల్లోనే పార్లమెంటులో ఓ బడ్జెట్‌ ఓడిపోవడం, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె(Sweden PM news) రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మగ్దలీనా.. "ఈ బాధ్యత గౌరవప్రదమే అయినా.. ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని నేను కోరుకోవడం లేదు" అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ''ఇండో-పసిఫిక్‌ ఇనీషియేటివ్‌'ను గుర్తిస్తున్నాము'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.