ఆ వ్యాక్సిన్​ మూడో డోసుతో ఒమిక్రాన్​కు చెక్!

author img

By

Published : Jan 13, 2022, 4:57 PM IST

omicron

Covishield Booster Dose: కొవిషీల్డ్​ మూడో డోసుతో ఒమిక్రాన్​ను ఎదుర్కొనే విధంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగతుందని ఆ వ్యాక్సిన్​ రూపకర్త ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. కొవిషీల్డ్​ లేదా ఇతర ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు తెలిసినట్లు పేర్కొంది.

Covishield Booster Dose: మూడో డోసుగా కొవిషీల్డ్​ తీసుకుంటే ప్రమాదకర ఒమిక్రాన్​ వేరియంట్​ను దీటుగా ఎదుర్కోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ మూడో డోసు తర్వాత శరీరంలో బీటా, ఆల్ఫా, డెల్డా, గామా వేరియంట్లను కూడా ఎదుర్కొనే స్థాయికి రోగనిరోధక శక్తి చేరుకుంటుందని తెలిసింది. కొవిషీల్డ్​ లేదా ఇతర ఎంఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్లు తీసుకున్నవారిపై ఆస్ట్రాజెనెకా సంస్థ ఈ పరిశోధనలు జరిపింది.

ఒమిక్రాన్​ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో కొవిషీల్డ్​ మూడో డోసును అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ క్రమంలో జరిపిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఒమిక్రాన్​ను మరింత దీటుగా ఎదుర్కొనేలా వ్యాక్సిన్​ను తయారు చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి : రూ.8కోట్లు ఖర్చు.. కరోనాపై 8 నెలల పోరాటం.. అయినా దక్కని రైతు ప్రాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.