అక్కడ వంట గ్యాస్​ సిలిండర్​ రూ. 2,657- కిలో పాలు రూ.1,195

author img

By

Published : Oct 11, 2021, 5:09 PM IST

Sri Lankan inflation

తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంది(sri lanka food emergency) శ్రీలంక. అక్కడ వంట గ్యాస్​ సిలిండర్​ ధర 90శాతం పెరిగింది(sri lanka food prices). ప్రస్తుతం అక్కడ సిలిండర్​ ధర రూ. 2,657. పాల ధరకు కూడా రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో పాల ధర రూ. 1,195గా ఉంది.

ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకలో నిత్యావసరాల ధరలు అమాంతం భగ్గుమన్నాయి(sri lanka food emergency). ఆహార పదార్థాలపై(sri lanka food prices) ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ఇందుకు కారణం. దీంతో ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి రూ.2,657కు చేరింది. ఇక కిలో పాల ధర ఐదు రెట్లు పెరిగి రూ.1,195కు ఎగబాకింది. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఎందుకీ 'ధరా'ఘాతం..?

గత ఏడాది కాలంగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది(sri lanka food inflation). ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి(sri lanka food crisis reason). ప్రత్యేకించి పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాస్త విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.

Cooking gas cylinder
శ్రీలంకలో ఆహార సంక్షోభం

సరఫరా తగ్గి..

అయితే ధరలపై నియంత్రణ తీసుకురావడం వల్ల అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షత సమావేశమైన కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

దీంతో ఒక్కసారిగా నిత్యావసర ధరల మోత మోగింది. గత శుక్రవారం రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. ఇవే కాదు.. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి:- సంక్షోభాలతో.. సంపన్న దేశాలకూ ఆహార కొరత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.