ప్రతీకారంతో డేటింగ్ పార్ట్​నర్​గా చేరి.. శృంగారంలో కత్తితో!

author img

By

Published : Mar 13, 2022, 2:00 PM IST

Women Stabbed Date

Women Stabbed Date: ప్రతీకారంతో.. అతన్ని ఆన్​లైన్ డేటింగ్ సైట్ ద్వారా పరిచయం చేసుకుంది ఆ మహిళ. ఓ హోటల్​లో కలుసుకునేలా అతన్ని ప్రేరేపించింది. గది తలుపులు వేసి.. లైట్లు ఆర్పివేసింది. అనంతరం మెడపై తీవ్ర రక్తస్రావంతో బయటకు పరుగులు తీశాడు బాధితుడు. ఇంతకీ ఆ గదిలో ఏం జరిగింది?

Women Stabbed Date: ప్రతీకారం తీర్చుకోవడానికి ఆన్​లైన్​ డేటింగ్ సైట్​లో పరిచయం చేసుకుని.. ఓ వ్యక్తిని కత్తితో పొడిచింది మహిళ. 2020 నాటి అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్​ మిలిటరీ లీడర్ ఖాసిం సులేమానీ మృతికి ప్రతీకారంగా ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు తెలిపింది.

Women Stabbed Date
డేటింగ్ పార్ట్​నర్​పై దాడి చేసిన మహిళ

ఇదీ జరిగింది..

నికా నికౌబిన్ (21).. ప్రతీకారం తీర్చుకోవడానికి బాధితున్ని ఆన్​లైన్ డేటింగ్​ సైట్​ ద్వారా పరిచయం చేసుకుంది. స్థానికంగా ఓ హోటల్​లో మార్చి 5న కలుసుకునేందుకు అతన్ని ఒప్పించింది. ఇందుకు ఓ రూమ్​ను అద్దెకు తీసుకున్నారు. గదిలో శృంగారంలో పాల్గొనే సమయంలో నికౌబిన్​.. బాధితుని కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత లైట్లను ఆర్పివేసింది. చీకటిలో బాధితున్ని ఏమార్చి శృంగారంలో పాల్గొంది. అప్పుడే గొంతుపై కత్తితో దాడి చేసింది. నిందితురాలిని పక్కకు తోసి హోటల్ గది నుంచి బయటపడ్డాడు బాధితుడు. తీవ్ర రక్తస్రావంతో పోలీసులకు ఫోన్ చేశాడు. అతనితో పాటే బయటకు వచ్చిన ఆ మహిళ.. కత్తితో దాడి చేసినట్లు హోటల్ సిబ్బందికి తెలిపింది.

us Women Stabbed Date
ఖాసిం సులేమానీ

Qassem Soleimani death: రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. 2020 నాటి అమెరికన్ డ్రోన్ దాడిలో చనిపోయిన ఇరాన్ మిలిటరీ నాయకుడు ఖాసీం సులేమానీ మృతికి ప్రతికారంగా ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుంది. అయితే.. 'గ్రేవ్​.. డిగ్గర్' అనే పాట తను ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రేరణనిచ్చిందని తెలిపింది.

ఇరాన్​ అగ్ర కమాండర్ జనరల్​ ఖాసీం సులేమానీని 2020లో మట్టుబెట్టింది అగ్రరాజ్యం. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్​కు సులేమానీ నాయకత్వం వహించారు.

ఇదీ చదవండి: బస్సులో మహిళపై అత్యాచారం.. పక్కా స్కెచ్​తో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.