బ్యాంక్​కు వెళ్లిన దర్శకుడికి షాక్.. గజ దొంగ అనుకుని అరెస్ట్.. చివరకు...

author img

By

Published : Mar 11, 2022, 2:38 PM IST

Updated : Mar 11, 2022, 3:11 PM IST

ryan coogler

Ryan Coogler bank of America: బ్యాంకు దోపిడీకి యత్నించాడన్న అనుమానంతో ఓ ప్రముఖ దర్శకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. బ్యాంకు ముందు ఇంజిన్​ ఆన్​ చేసి ఉన్న ఆయన కారు డ్రైవర్​, మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొద్ది నిమిషాల్లోనే వారిని విడుదల చేశారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ డైరెక్టర్​ ఎవరు?

Ryan Coogler bank of America: బ్లాక్​ పాంథర్​ వంటి బ్లాక్​బాస్టర్​ సినిమాలు తీసిన ప్రముఖ హాలీవుడ్​ దర్శకుడు ర్యాన్​ కూగ్లర్​కు చేదు అనుభవం ఎదురైంది. దోపిడీకి వచ్చినట్లు అనుమానించిన బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ను అరెస్ట్​ చేశారు. అమెరికా, జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు ఉద్యోగులు తప్పుగా భావించి ఇచ్చిన సమాచారం వల్ల ఇలా జరిగినట్లు తెలుసుకుని కొద్ది క్షణాల్లోనే కూగ్లర్​​ను వదిలేశారు.

ryan coogler
దర్శకుడు ర్యాన్​ కూగ్లర్​ను అరెస్ట్​ చేస్తున్న అధికారి

ఇదీ జరిగింది..

జనవరి 7న అట్లాంటాలోని బ్యాంక్​ ఆఫ్​ అమెరికా బ్రాంచ్​కు వెళ్లారు డైరెక్టర్​ ర్యాన్​ కూగ్లర్​. నగదు ఉపసంహరణ చేసేందుకు కౌంటర్​ వద్దకు వెళ్లారు. సుమారు 12వేల డాలర్ల నగదును ఉపసంహరించేందుకు ప్రయత్నించారు. విత్​డ్రాల్​ స్లిప్​ వెనకాల 'నగదు ఇచ్చేటప్పుడు ఈ వ్యక్తి ఎవరో రహస్యంగా ఉండండి'(దర్శకుడు కాబట్టి.. ఇతరుల దృష్టిని ఆకర్షించకుండా ఉండేందుకు) అని నోట్​ రాసి ఇచ్చారు. కానీ బ్యాంకు సిబ్బంది మరోలా అర్థం చేసుకున్నారు. వారి కంప్యూటర్​లో అలర్ట్​ నోటిఫికేషన్​ వచ్చింది. బ్యాంకు దోపిడీకి వచ్చినట్లు భావించిన అక్కడి ఉద్యోగిని.. మేనేజర్​కు సమాచారం అందించి అప్రమత్తం చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా.. బ్యాంకు ముందు బ్లాక్​ లెక్సస్​ ఎస్​యూవీ కారు ఇంజిన్​ ఆన్​ చేసి ఉండటాన్ని గమనించారు. డ్రైవర్​ను వివరాలు అడగగా.. తాను కూగ్లర్​​ కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఈ వివరాలు సరిపోలటం వల్ల వెంటనే డ్రైవర్​తో పాటు అందులోని ఓ మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి సంకెళ్లు వేయలేదు. మరో ఇద్దరు అధికారులు బ్యాంకులోకి వెళ్లి కూగ్లర్​కు సంకెళ్లు వేసి బయటకు తీసుకొచ్చారు.

ryan coogler
బ్యాంకు ముందు మాట్లాడుతున్న దర్శకుడు ర్యాన్​ కూగ్లర్

పోలీస్​ యూనిఫాంకు ఉన్న కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. క్యాష్​ కౌంటర్​ వద్ద గ్రే కలర్​ టీషర్ట్​, బ్లాక్​ క్యాప్​, సన్​గ్లాసెస్​, తెల్లటి మాస్క్​ ధరించి కూగ్లర్​ నిలుచుని ఉన్నారు. ఓ అధికారి తుపాకీ తీయగా.. మరో అధికారి చేతులు వెనక్కి పెట్టాలని చెప్పారు. అర్థం కాని డైరెక్టర్​.. ఏం జరుగుతోంది అంటూ ప్రశ్నించారు. బ్యాంకులోంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. తాను తన ఖాతాలోంచి నగదు తీసుకునేందుకు వచ్చానని పోలీసులకు తెలిపారు క్లూగర్​.

వివరాలు తెలుసుకున్న పోలీసులు.. బ్యాంకు సిబ్బంది తప్పుగా భావించటం వల్ల ఇదంతా జరిగినట్లు గుర్తించారు. వెంటనే కూగ్లర్​​కు వేసిన సంకెళ్లను తొలగించారు. ఆయన డ్రైవర్​, మరో మహిళను సైతం విడిచిపెట్టారు. తమకు అందిన తప్పుడు సమాచారంతోనే ఈ మేరకు సంకెళ్లు వేసినట్లు కూగ్లర్​కు వివరించారు పోలీసులు.

నగదు ఇవ్వాల్సి రావటం వల్లే వచ్చా..

తన కోసం పని చేస్తున్న వైద్యురాలికి డబ్బులు ఇవ్వాల్సి ఉందని, ఆమె నగదు రూపంలోనే ఇవ్వాలని కోరిన నేపథ్యంలో బ్యాంకుకు వచ్చినట్లు వివరించారు కూగ్లర్​​. కౌంటర్​ ద్వారా ఇంత మొత్తం నగదును తీసుకోవటం ద్వారా అభద్రతగా ఉంటుందనే కారణంగానే విత్​డ్రాల్​ స్లిప్​పై రాసి ఇచ్చినట్లు చెప్పారు. 'ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, నా ఖాతా నుంచి డబ్బు తీసుకున్నందుకు తుపాకీ ఎక్కుపెట్టారు' అని ఆందోళన వ్యక్తం చేశారు కూగ్లర్​​. నగదు ఇచ్చే వ్యక్తి తనకు సమస్య అని చెప్పలేదని, నేరుగా మేనేజర్​ గదికి వెళ్లి మాట్లాడిందన్నారు.

ryan coogler
ర్యాన్​ కూగ్లర్​, ఆయన డ్రైవర్​తో మాట్లాడుతున్న పోలీసులు

అందుకే అనుమానం..

మరో కెమెరాలో బ్యాంకు ఉద్యోగిని జరిగిన విషయాన్ని చెప్పిన దృశ్యాలు రికార్డయ్యాయి. కూగ్లర్​​ తనకు విత్​డ్రాల్​ స్లిప్​ ఇచ్చారని, ఆయన డెబిట్​ కార్డు ద్వారా నగదు తీసుకోవాలని కోరినప్పటికీ.. సమాధానం ఇవ్వకుండా స్లిప్​పై నోట్​ రాసి ఇచ్చారని చెప్పారు. గుర్తింపు కార్డు అడగగా.. కాలిఫోర్నియాకు చెందిన కార్డు ఇచ్చారని, ఉపసంహరిస్తున్న నగదు పెద్ద మొత్తంలో ఉండటం వల్ల తనకు అనుమానం వచ్చిందన్నారు. కంప్యూటర్​ సైతం హైరిస్క్​తో కూడుకున్న లావాదేవీగా అలర్ట్​ చేసిందని.. దీంతో మేనేజర్​కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ వెంటనే 911కు కాల్​ చేశానన్నారు.

బ్యాంకు విచారం..

ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది బ్యాంక్​ ఆఫ్​ అమెరికా. ఇలాంటిది ఎప్పుడూ జరగకూడదని, కూగ్లర్​కు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: 'ప్రపంచానికి మరో వైరస్ ముప్పు'.. ఉక్రెయిన్​కు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

Last Updated :Mar 11, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.