ఓ మై గాడ్​.. పామును చేప మింగేసిందా?

author img

By

Published : Nov 23, 2021, 5:30 PM IST

Fish swallows snake

సైజు పరంగా చూస్తే చేప చిన్నగా ఉంటుంది. పాము.. చేప కంటే చాలా పెద్దగా ఉంటుంది. అలాంటిది.. పామును చేప వేటాడడం ఎప్పుడైనా చూశారా? వేటాడి.. అమాంతం మింగడం(Fish swallows snake) గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం గనుక 'లేదు.. కాదు' అయినట్లైతే.. ఓసారి ఈ స్టోరీ చదివేయండి.

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు ఎన్నో వైరల్​ అవుతూ ఉంటాయి. అందులో పాములు తమ కంటే పెద్దగా ఉన్న వస్తువులను, ఇతర జీవులను మింగేస్తూ ఉంటాయి. అయితే.. మీరెప్పుడైనా ఓ చిన్న చేప... పామును అమాంతం మింగడం(Fish swallows snake) చూశారా? "అయినా అది ఎలా సాధ్యం? చేప చిన్నగా ఉంటుంది. పాము పెద్దగా ఉంటుంది. ఇది ఎక్కడైనా జరుగుతుందా?" అని సందేహపడుతున్నారా? కానీ ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి(Snake fish video)... ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?

పామును చేప మింగే ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో ఓ వ్యక్తి షేర్ చేశాడు. 'ఒక మీటర్​ పొడవు ఉన్న పామును చేప మింగుతోంది,' అని ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు. అయితే.. ఆ వీడియోలో ఉన్నది నిజంగా పాము కాకపోయినా.. అలాగే ఉండే ఓ ఈల్​గా తెలుస్తోంది. వీడియోలో.. ఓ నది ఒడ్డున పొదల్లో నక్కి ఉన్న ఈల్​ కోసం చేప మాటు వేసింది. అప్పుడు ఈల్​ బయటకు రాగానే ఒక్కసారిగా తన నోట కరుచుకుని, నెమ్మదిగా మింగి నీటిలోకి జారుకుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'ఓ మై గాడ్ ఇదెలా సాధ్యం? నేను చూస్తున్నది నిజమేనా,' అని ఓ యూజర్ కామెంట్​ చేయగా.. 'ఇదో పెద్ద వింత' అని మరో నెటిజన్​ అన్నాడు. ఇప్పుడు ఆ వీడియోనూ మీరూ చూసేయండి మరి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.