కరోనా కట్టడిపై బైడెన్​ కీలక ప్రకటన.. రంగంలోకి ఆర్మీ!

author img

By

Published : Jan 14, 2022, 2:05 PM IST

Biden

US Army Corona: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ విజృంభణతో అమెరికా విలవిల్లాడుతోంది. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్షుడు జో బైడెన్​. దేశ పౌరులకు ఉచితంగా 1 బిలియన్​ రాపిడ్​ కిట్లు, ఎన్​95 మాస్కులు అందిస్తామని తెలిపారు. అలాగే.. దేశవ్యాప్తంగా 1000 మంది మిలిటరీ వైద్యులను మోహరించనున్నట్లు ప్రకటించారు.

US Army Corona: అమెరికాలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత ఉద్ధృతుమవుతున్న నేపథ్యంలో వైరస్​ కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​. ఇంట్లోనే కొవిడ్​-19 పరీక్షలు చేసుకునేలా 100 కోట్ల రాపిడ్​ కిట్లతో పాటు వైరస్​ బారినపడకుండా రక్షణ కల్పించే ఎన్​95 మాస్క్​లను తమ పౌరులకు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఒమిక్రాన్​ వేరియంట్​ విజృంభణలో ఈ చర్యలు ఉపకరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

శ్వేతసౌంధంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక విషయాలు వెల్లడించారు అధ్యక్షుడు.

"కరోనా కేసులు గరిష్ఠంగా నమోదవుతున్న క్రమంలో మనమంతా నిరుత్సాహంతోనే నూతన ఏడాదిలోకి ప్రవేశించామని తెలుసు. ఇప్పటికీ వ్యాక్సిన్​ తీసుకోనివారికే ఎక్కువ ప్రమాదం. టీకా తీసుకున్నవారు వైరస్​ బారినపడినా తీవ్ర అనారోగ్యానికి గురికావటం, మరణించటం వంటివి నమోదు కావటం లేదని గణాంకాలు చెబుతున్నాయి. "

- జో బైడెన్​, అమెరికా అధ్యక్షుడు

రంగంలోకి మిలిటరీ వైద్యులు

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 1000 మంది మిలిటరీ వైద్య సిబ్బందిని దేశవ్యాప్తంగా మోహరిస్తామని ప్రకటించారు బైడెన్​. వైద్య సౌకర్యాలను పెంచటం, సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలోనే.. చాలా మంది వైద్య సిబ్బంది వైరస్​ బారినపడి హోమ్​ క్వారంటైన్​కు వెళ్తున్నారు. దీంతో పెద్ద పెద్ద ఆసుపత్రులు సైతం సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ కొరతను తగ్గించేందుకు ఫెడరల్​ మెడికల్​ సిబ్బందిని పలు రాష్ట్రాలకు పంపించింది బైడెన్​ ప్రభుత్వం. వీటికి అధనంగా మిలిటరీ వైద్యులను అవసరమైన ప్రాంతాల్లోకి పంపనున్నారు.

ఇదీ చూడండి:

కరోనా విలయం- ప్రపంచవ్యాప్తంగా 32 కోట్లు దాటిన కేసులు

అమెరికాలో కరోనా ఉగ్రరూపం- ప్రపంచవ్యాప్తంగా మరో 31లక్షల మందికి వైరస్​

సిబ్బంది కొరత- కరోనా సోకిన నర్సులతోనే వైద్య సేవలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.