సూది లేకుండానే టీకా.. శాస్త్రవేత్తల ఘనత

author img

By

Published : Sep 26, 2021, 6:27 AM IST

patch vaccine

సూది అవసరం లేకుండానే టీకా​ ఇచ్చేందుకు ఒక చిన్నపాటి పట్టీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా సాధారణ వ్యాక్సిన్‌ కన్నా మంచి ఫలితాలను రాబట్టవచ్చని పేర్కొన్నారు.

సూది అవసరం లేకుండానే వ్యాక్సిన్​ ఇచ్చేందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఒక చిన్నపాటి పట్టీని అభివృద్ధి చేశారు. ఇంజెక్షన్‌ రూపంలో ఇచ్చే సాధారణ వ్యాక్సిన్‌ కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుందని వారు తెలిపారు. త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. చర్మంలో రోగ నిరోధక కణాలు ఎక్కువగా ఉంటాయి. టీకాలకు లక్ష్యాలు ఇవే. చర్మానికి ఈ పట్టీని అతికించడం ద్వారా నేరుగా మంచి ఫలితాలను రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇంజెక్షన్‌ ద్వారా చేతి కండరంలోకి నేరుగా చేరవేసిన టీకా కన్నా ఇది 10 రెట్లు సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు.

రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన టి-కణ స్పందనను 50 రెట్లు ఎక్కువగా కలిగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలీమర్‌ పట్టీపై త్రీడీ ముద్రిత సూక్ష్మ సూదులను అమర్చడం ద్వారా దీన్ని సిద్ధం చేశారు. తక్కువ మోతాదు కలిగిన, నొప్పి కలిగించని టీకాలను వేగంగా అభివృద్ధి చేయడానికి ఇది పునాదులు వేస్తుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన జోసెఫ్‌ డి సైమోన్‌ పేర్కొన్నారు. ప్లూ, మీజిల్స్‌, హెపటైటిస్‌, కొవిడ్‌-19 టీకాలు ఇవ్వడానికి అనుగుణంగా ఈ సూక్ష్మసూదుల్లో మార్పులు చేపట్టవచ్చని వివరించారు. వీటికి టీకా పూత ఉంటుంది. ఈ సూదులు చర్మంలో కరిగిపోతాయి. ఈ పట్టీని చర్మానికి అతికించుకోవడం ద్వారా ఎవరికివారే టీకా పొందొచ్చు.

ఇదీ చూడండి: Eye problems: నీరు తాగట్లేదా? కంటి సమస్యలు వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.