IPL 2023 PBKS VS DC : పంజాబ్ హీరో ప్రభ్ సిమ్రన్ సింగ్.. మ్యాచ్ హైలైట్ ఫొటోస్ చూశారా?
Updated: May 14, 2023, 7:47 AM |
Published: May 14, 2023, 7:47 AM
Published: May 14, 2023, 7:47 AM
Follow Us 

ఐపీఎల్ 16 సీజన్లో పంజాబ్ ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన హైలైట్ పిక్స్ మీకోసం..

1/ 18
బౌలర్లు ఆధిపత్యం సాగించిన మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (103; 65 బంతుల్లో 10×4, 6×6) అద్భుత సెంచరీ బాదడంతో ఐపీఎల్16 సీజన్ ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది పంజాబ్ కింగ్స్. 31 పరుగుల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. మొదట 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసిన పంజాబ్.. ఆ తర్వాత దిల్లీ జట్టును 136/8కు కట్టడి చేసింది. స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్ (4/30), రాహుల్ చాహర్ (2/16)లతో పాటు పేసర్ ఎలిస్ (2/26) ఆ జట్టును గట్టిగా దెబ్బ తీశారు. ఛేదనలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ వార్నర్ (54; 27 బంతుల్లో 10×4, 1×6).. సాల్ట్ (21)తో కలిసి 69 పరుగులు జోడించి దిల్లీకి చక్కటి ఆరంభాన్నిచ్చినా, ఫస్ట్ వికెట్ పడ్డాక ఆ జట్టు గాడి తప్పింది. బ్రార్ కీలక వికెట్లు తీసి దిల్లీని కోలుకోకుండా చేశాడు. అతడికి రాహుల్ చాహర్ కూడా తోడవడం వల్ల 88/6తో దిల్లీ ఓటమి వైపు అడుగులేసింది. మరి ఈ మ్యాచ్‌లో కెమెరా కంటికి చిక్కిన ప్లేయర్స్ విన్యాసాలను చూసేద్దాం..
Loading...
Loading...
Loading...