పంత్ కోలుకోవాలంటూ ఉజ్జయినీ అమ్మవారిని దర్శించుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు
Updated: Jan 23, 2023, 12:12 PM |
Published: Jan 23, 2023, 10:52 AM
Published: Jan 23, 2023, 10:52 AM

న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే క్రికెట్ మ్యాచ్‌కోసం మధ్యప్రదేశ్‌లో ఉన్న భారత్ ఆటగాళ్లు కొంతమంది ఉజ్జయిని మహాకాళేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు పలువురు సహాయక సిబ్బంది.. సోమవారం తెల్లవారుఝామున దేవాలయానికి చేరుకున్నారు. తెల్లవారుఝామున జరిగే శివుని భస్మ హారతి కార్యక్రమంలో సంప్రదాయ ధోతీ, పంచె ధరించి పాల్గొన్నారు. డిసెంబరు 30న కార్ యాక్సిడెంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషబ్ పంత్ తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1/ 10
టెంపుల్లో టీమ్ ఇండియా క్రికెటర్స్

Loading...