గారాలపట్టీలతో తారలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో
Published on: Nov 23, 2022, 5:58 PM IST |
Updated on: Nov 23, 2022, 5:58 PM IST
Updated on: Nov 23, 2022, 5:58 PM IST

ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమలు బంధాలు ఉన్నా తండ్రి కూతుర్ల ప్రేమ అనుబంధం ఎంతో ప్రత్యేకం. అబ్బాయి అమ్మ కొంగుచాటు బిడ్డ అంటే అమ్మాయి నాన్న కూచి అంటారు. ఎందుకంటే ప్రతి అమ్మాయికి తన నాన్నే తొలి హీరో అలానే ప్రతి తండ్రికి తన కూతురే మహారాణి. తన చిన్నారికి చిట్టి చిట్టి నడకను మాత్రమే కాదు ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి మార్గదర్శిగా నిలుస్తాడు. అతడికి ఎంత సంపాదించినా రాని ఆనందం తన గారాలపట్టి ముఖంలో చిరునవ్వును చూస్తే చాలు ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు లేడని తెగ సంబరపడిపోతుంటాడు. ఈ విషయంలో మన సెలబ్రిటీలేమీ ప్రత్యేకం కాదు. వారు కూడా తమ కూతుర్ల విషయానికొస్తే.. వారిని చూసి ఎంతో మురిసిపోతుంటారు. ఖాళీ దొరికితే తమ లిటిల్ ప్రిన్సెస్తో కలిసి చిన్నపిల్లల్లా మారిపోయి ప్రపంచాన్ని మర్చిపోయి సమయాన్ని గడిపేస్తుంటారు. అలా తమ కూతుర్లతో కలిసి గడిపిన సంతోష క్షణాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. తమ ప్రేమను తెలియజేస్తుంటారు. ఓ సారి మన సినీ క్రీడా తారలు తమ కూతురితో కలిసి గడిపిన మధరు క్షణాలకు సంబంధించిన ఫొటోలను చూసేద్దాం.
1/ 23
allu arjun virat kohli mahesh babu daughters photos and other Celebrities daughters

Loading...