సీఎం జగన్ సభ, తాగర అన్నో- తాగి ఊగర అన్నో! ఇదేనా మద్య నిషేధమంటే?
Updated: Nov 16, 2023, 12:12 PM |
Published: Nov 16, 2023, 12:12 PM
Published: Nov 16, 2023, 12:12 PM
Follow Us 

YSRCP Leaders Liquor Distribution in CM Tour in Macherla : సీఎం జగన్ సభ అంటే తాగర అన్నో- తాగి ఊగర అన్నో! అనే విధంగా మాచర్ల పర్యటన సాగింది. వైసీపీ కార్యకర్తలు తాగి ఊగిపోయిన తతంగాన్ని చూసిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదేనా మద్య నిషేధమంటే అని జగన్ను ప్రశ్నిస్తున్నారు.

1/ 6
YSRCP Leaders Liquor Distribution in CM Tour in Macherla : సీఎం జగన్ పర్యటనలో మద్యం ఏరులై పారింది. వైసీపీ కార్యకర్తలు తాగి ఊగిపోయారు. కొందరు మత్తు ఎక్కువై రోడ్డు పక్కన, సభాస్థలిలో పడిపోయారు. పల్నాడు జిల్లా మాచర్లలో నిర్వహించిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకం శంకుస్థాపన (Foundation stone laying of Varikapudishela Lift Scheme), బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి జనసమీకరణ చేశారు. ప్రతి గ్రామానికి ఒక ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. నాయకులు, వాలంటీర్లు, డ్వాక్రా సంఘ నాయకురాళ్లతో జనాన్ని తరలించారు. బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికీ రెండేసి మద్యం సీసాలు, పలావు ప్యాకెట్ ఇచ్చారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు సీఎం ప్రయాణించిన రోడ్డు మార్గం పక్కనే ఉదయం 9 గంటల నుంచే కార్యకర్తలు మద్యం తాగుతూ కనిపించారు. ఛీప్ లిక్కర్ తాగిన వారిలో కొందరు కడుపులో మంటతో అల్లాడిపోయారు. వారికి స్థానికులు తాగునీరు ఇచ్చి సపర్యలు చేశారు. జగన్ పర్యటనలో వేల మద్యం సీసాలు సరఫరా చేశారు. కొన్ని తండాల్లో నాటుసారా కూడా పంపిణీ చేసినట్లు తెలిసింది.
Loading...
Loading...
Loading...