నేతాజీ పేపరు చదువుతున్నారు వెనకనుంచి మెల్లగా హిట్లర్ వచ్చాడు
Published on: Jan 23, 2023, 5:59 PM IST |
Updated on: Jan 23, 2023, 5:59 PM IST
Updated on: Jan 23, 2023, 5:59 PM IST

నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అంటూ యువతను కార్యోన్ముఖులను చేసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలోకి దింపిన మహా యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. తాను పుట్టిందే భారత దేశ దాస్యశృంఖలాలను తెంచేందుకు అన్నట్టుగా బతుకంతా దేశానికే ధారబోశారు సుభాష్ చంద్ర బోస్. అతివాద ఉద్యమానికి వెన్నెముకగా మారి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ మూకల గుండెల్లో నిదురించారు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంత ద్వారా మాత్రమే తెల్ల వారిని తరిమికొట్ట గలమని గట్టిగా నమ్మిన సుభాష్ చంద్రబోస్ అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడలేదు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బోస్ వదులుకోదలుచుకులేదు. ఇందులో భాగంగానే నియంతగా పేరుగాంచిన హిట్లర్‌తో సైతం చేతులు కలిపేందుకూ సిద్ధపడ్డారు. నాజీ సేనల సహకారంతో బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టవచ్చన్న ఆలోచనతోనే హిట్లర్‌ను కలిసేందుకు బోస్ జర్మనీ వెళ్లారని మెజారిటీ అభిప్రాయం. అయితే బోస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మేధావుల నుంచి సామాన్యుల వరకూ రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. ఇప్పటికీ ఆ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉంచితే జర్మనీలోని హిట్లర్ నివాసంలో హిట్లర్‌ను బోస్ కలిసిన రోజు ఏం జరిగింది అనే విషయమై ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇవాళ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ స్టోరీ చూద్దాం.
1/ 19
నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను అంటూ యువతను కార్యోన్ముఖులను చేసి భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలోకి దింపిన మహో యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. తాను పుట్టిందే భారత దేశ దాస్యశృంఖలాలను తెంచేందుకు అన్నట్టుగా బతుకంతా దేశానికే ధారబోశారు సుభాష్ చంద్ర బోస్. అతివాద ఉద్యమానికి వెన్నెముకగా మారి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి బ్రిటీష్ మూకల గుండెల్లో నిదురించారు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంత ద్వారా మాత్రమే తెల్ల వారిని తరిమికొట్ట గలమని గట్టిగా నమ్మిన సుభాష్ చంద్రబోస్ అందుకోసం ఏం చేయడానికైనా వెనుకాడలేదు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బోస్ వదులుకోదలుచుకులేదు. ఇందులో భాగంగానే నియంతగా పేరుగాంచిన హిట్లర్‌తో సైతం చేతులు కలిపేందుకూ సిద్ధపడ్డారు. నాజీ సేనల సహకారంతో బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమికొట్టవచ్చన్న ఆలోచనతోనే హిట్లర్‌ను కలిసేందుకు బోస్ జర్మనీ వెళ్లారని మెజారిటీ అభిప్రాయం. అయితే బోస్ తీసుకున్న ఈ నిర్ణయంపై మేధావుల నుంచి సామాన్యుల వరకూ రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు సమర్థిస్తే మరికొందరు వ్యతిరేకించారు. ఇప్పటికీ ఆ చర్చ కొనసాగుతూనే ఉంటుంది. ఇదిలా ఉంచితే జర్మనీలోని హిట్లర్ నివాసంలో హిట్లర్‌ను బోస్ కలిసిన రోజు ఏం జరిగింది అనే విషయమై ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇవాళ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ స్టోరీ చూద్దాం.

Loading...