Tribals Photo Exbhition: అదివాసి తెగల ఫోటో ప్రదర్శన.. 18 రాష్ట్రాల గిరిజనుల చిత్రాలు ఒకే దగ్గర
Updated: May 26, 2023, 3:51 PM |
Published: May 26, 2023, 3:51 PM
Published: May 26, 2023, 3:51 PM

Photo Exbhition ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఒనకడిల్లికి వార సంతలో గిరిజన తెగలకు చెందిన ఫొటో ప్రదర్శన నిర్వహించారు. ఒనకడిల్లి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. గడబ గిరిజనుల వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ తెగకు చెంది ప్రజలను చూడటానికి వివిధ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. కానీ, హైదరాబాద్కు చెందిన సతీశ్ లాల్ అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. ఇప్పుడు మాత్రం ఇతర తెగలకు చెందిన ఫొటోలను ఒనకడిపల్లిలో ప్రదర్శనకు ఉంచారు.

1/ 20
ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని ఒనకడిల్లికి వార సంతలో గిరిజన తెగలకు చెందిన ఫొటో ప్రదర్శన నిర్వహించారు. ఒనకడిల్లి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. గడబ గిరిజనుల వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ తెగకు చెంది ప్రజలను చూడటానికి వివిధ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. కానీ, ఇప్పుడు మాత్రం ఇతర తెగలకు చెందిన ఫొటోలను ఒనకడిపల్లిలో ప్రదర్శనకు ఉంచారు. ఇందులో 18 రాష్ట్రాలకు చెందిన వివిధ తెగలకు చెందిన ఫొటోలను ప్రదర్శించారు. హైదరాబాద్కు చెందిన సతీశ్ లాల్ అందరి కంటే భిన్నంగా ఆలోచించాడు. దేశ విదేశాల ప్రజలు గడబ తెగను చూడటానికి వస్తే.. సతీశ్ మాత్రం ఇతర తెగలనే ఒనకడిల్లి తెగ ప్రజలకు చూపించారు. అతను గత 12 సంవత్సరాలుగా తిరిగిన 18 రాష్ట్రాల్లో నివసిస్తున్న తెగల ఫొటోలను తీసీ.. వాటిని స్థానిక గిరిజన ప్రజలకు చూపించారు. దీని ద్వారా గిరిజనులు మంచి అనుభూతి పొందారు. అంతేకాకుండా స్వయంగా ఫొటోలు తీసుకుని సంబరపడ్డారు. అప్పటికే సందర్శనకు వచ్చిన వారి ఫొటోలు గతంలో తీసినవి ఉంటే వారికే ఉచితంగా అందించారు. అత్యంత మారుమూల గ్రామంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Loading...