కళకళలాడాల్సిన సరస్సు ఎడారిని తలపిస్తోంది - జాడే లేని వలస పక్షులు
Updated: Nov 15, 2023, 8:53 PM |
Published: Nov 15, 2023, 8:53 PM
Published: Nov 15, 2023, 8:53 PM
Follow Us 

Pulicat Lake: పులికాట్ సరస్సు అంటే ఠక్కున గుర్తుకొచ్చేది.. నీళ్లలో నడిచే ఎర్రకాళ్ల కొంగలు, ఈదులాడే గూడబాతులు, ఎగురుతూ వాలే పిట్టలు, విదేశాల నుంచి వలస వచ్చే పక్షులు. ప్రతి ఏడాది సెప్టెంబరు 15 నుంచి వలస పక్షుల సందడి మొదలవుతుంది. కానీ, ఈసారి ఆ సందడి లేక పులికాట్ సరస్సు వెలవెలబోతుంది.

1/ 8
No water in Pulicat Lake: పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ సముద్రపు నీరు, మంచినీరు కలవడం వల్ల సముద్రపు నీరంతా ఉప్పగా ఉండదు. అయితే ఎప్పుడూ నీటితో కళకళలాడే సరస్సు ఈసారి మాత్రం ఎడారిని తలపిస్తోంది. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా ప్రసిద్దిగాంచిన పులికాట్ సరస్సులోకి.. తిరుపతి జిల్లా రాయదొరువు, కొండూరుపాళెం.. తమిళనాడులోని పల్లవర్కాడ్ వద్దనున్న ముఖద్వారాల నుంచి సముద్రపు నీరు వస్తుంది. సరస్సుకు ప్రాణాధారమైన ఈ ముఖద్వారాలు ఏపీలో పూడికతో నిండిపోవడంతో కుంచించుకుపోయాయి. అక్రమంగా రొయ్యల చెరువులు, సున్నపు గుల్ల తరలించుకుపోవడంతో మడ అడవులు తగ్గి, సరస్సు రూపురేఖలు మారిపోయాయి. సరస్సులోకి వచ్చిన పక్షులకు ఆహారం దొరకడం లేదు. వివిధ దేశాల నుంచి 157 రకాలకుపైగా పక్షి జాతులు రావాల్సి ఉండగా.. ఈసారి వాటి జాడే కనిపించటం లేదు. రూ.200 కోట్లతో సరస్సు ముఖద్వారాల ఆధునికీకరణకు కేంద్ర సముఖత చూపింది. కానీ, రాష్ట్రం ఆ నిధులను సాధించుకోలేకపోయింది.
Loading...
Loading...
Loading...